విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గంగిరేవువలస, ఉలిపిరి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి పథకాలను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, వైకాపా అరకు నియోజకవర్గ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు ప్రారంభించారు. తాగునీటి పథకాలు లేని చోట, గిరిజనులు రక్షిత మంచినీరు లభించక చెలమనీరు, బురదనీరు తాగి అనారోగ్యాల బారిన పడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాగు నీటి పథకాలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, యుద్ధ ప్రాతిపదికన ఆ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
అర్బన్ హౌసింగ్ స్కీం కింద ఆగిన నిర్మాణాలను పూర్తి చేయండి: తెదేపా