ETV Bharat / state

MINISTER BOTSA: 'మంత్రివర్గ విస్తరణపై సీఎంకు పూర్తి స్వేచ్ఛ ఉంది' - paidithalli sirimanotsavam

మంత్రివర్గ విస్తరణ(cabinet expandation) అనేది సీఎం ఇష్టమని మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa sathyanarayana) అన్నారు. విజయనగరం జిల్లా పైడితల్లి సిరిమానోత్సవం(paidithalli syrimanothsavam) వేడుకలకు సంబంధించి అధికారులతో సమీక్ష(review) నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, సంప్రదాయకంగా వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Sep 26, 2021, 1:49 PM IST

మంత్రివర్గంపై సీఎంకు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆయన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం ఇష్టమని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి ఉత్సవ నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.

ఆనవాయితీగా దసరా తర్వాత వచ్చే మంగళవారం సిరిమానోత్సవం నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఉత్సవానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ వల్ల ప్రస్తుతం ఆరోగ్యకరమైన పరిస్థితులు లేవని మంత్రి అన్నారు. మూడో వేవ్‌పై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేసినందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, సంప్రదాయకంగా వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం ఇష్టం. మంత్రివర్గంపై సీఎంకు పూర్తి స్వేచ్ఛ ఉంది. సీఎం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఆనవాయితీగా దసరా తర్వాత వచ్చే మంగళవారం సిరిమానోత్సవం నిర్వహిస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొవిడ్‌ వల్ల ఇప్పుడు పరిస్థితులు ఆరోగ్యకరంగా లేవు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, సంప్రదాయకంగా వేడుకలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. - బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి

ఇదీచదవండి.

SIMHADRI APPANNA: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.