విజయనగరం కలెక్టరేట్ ఎదుట.. మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాకు దిగారు. భోజన మెనూలో చేసిన మార్పులకు తగ్గట్లుగా తమకు చెల్లించే ధరలు పెంచాలంటూ నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి 4 నుంచి 6 రూపాయలు చెల్లిస్తున్నారని కార్మికులు తెలిపారు. ఖర్చు సుమారు 20 రూపాయలు అవుతోందని అన్నారు. ఆరు నెలలుగా బకాయిలు చెల్లించకున్నా... తాము మధ్యాహ్న భోజన పథకానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్వహిస్తున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు పెంచడమే కాకుండా... బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: