విజయనగరం జిల్లా బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ఆరు మండలాలకు చెందిన మరో 169 పంచాయతీలను విలీనం చేస్తూ... పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అథారిటీ పరిధిలో బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం పురపాలికలతో పాటు విజయనగరం జిల్లాలోని 11 మండలాల్లోని 572 గ్రామాలు ఉన్నాయి. కాగా...వీటికి అదనంగా నూతన అథారిటీ పరిధిలోకి తెర్లాం, బలిజపేట, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని 833 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ... పురపాలక శాఖ కార్యదర్శి జే.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీచదవండి.