ETV Bharat / state

కలెక్టర్​ ఆధ్వర్యంలో బ్యాంకుల స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం

author img

By

Published : Mar 19, 2021, 8:28 PM IST

పాడి ప‌శువుల కొనుగోలుకు రైతులకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాల్సి ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్​ హరిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. బ్యాంకు, జిల్లా అధికారులతో జరిగిన.. బ్యాంకుల స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో కలెక్టర్​ మాట్లాడారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అమ‌లుపై స‌మీక్షించారు.

Meeting of the Coordinating Committee of Banks
బ్యాంకుల స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం

రానున్న కాలంలో ‌జిల్లా భ‌విష్య‌త్తు అంతా పాడి ప‌రిశ్ర‌మపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని విజయనగరం జిల్లా కలెక్టర్​ హరిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ఈ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చి పాడి ప‌శువుల కొనుగోలుకు రైతుల‌కు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాల్సి ఉంద‌న్నారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో బ్యాంకు, జిల్లా అధికారుల‌తో.. బ్యాంకుల స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా నాబార్డు 2021-22 సంవ‌త్స‌రానికి రూపొందించిన జిల్లా రుణ సామ‌ర్థ్య అంచ‌నా ప్ర‌ణాళిక‌ను క‌లెక్ట‌ర్ విడుద‌ల చేశారు.

వ్య‌వ‌సాయ టెర్మ్ రుణాలు ల‌క్ష్యానికి మించి అందించామని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజ‌ర్ కె.శ్రీ‌నివాస‌రావు అన్నారు. వ్య‌వ‌సాయ రంగ నిపుణులు, బ్యాంక‌ర్లు త‌దిత‌ర అన్ని వ‌ర్గాల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాతే రుణ సామ‌ర్థ్య అంచ‌నా ప్ర‌ణాళిక రూపొందించామ‌ని నాబార్డు ఏజీఎం పి.హ‌రీశ్​ చెప్పారు. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అమ‌లుపై కలెక్టర్​ స‌మీక్షించారు. పథకం అమలులో ఏయే బ్యాంకులు వెనుకబడి ఉన్నాయో.. దరఖాస్తుల తిరస్కరణకు కారణాలు తెలపాలని బ్యాంకు అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. రుణాల మంజూరుకు బ్యాంకర్లంతా సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: ఏపీలో లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయట్లేదు: ఎంపీ కనకమేడల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.