ETV Bharat / state

ఔషధి ప్యాడ్స్‌... కష్టాన్ని తీర్చేందుకే!

నెలలో ‘ఆ మూడు రోజులు’ స్త్రీలందరికీ సాఫీగానే సాగిపోతున్నాయా? లేదు... చాలామంది మహిళలకుఆ రోజులు నరకప్రాయమే!  నెలసరి సమయంలో రుతుస్రావాన్ని అదుపు చేసేందుకు ఆకులు, మాసినబట్టలు, చెక్కలు వాడి తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు వాళ్లు. ఈ విషయాలని  తన అనుభవంలో  తెలుసుకున్న శాస్త్రవేత్త రమాదేవి అలాంటి వారికోసం ప్రత్యేకమైన‘ఔషధి ప్యాడ్స్‌’ను తయారుచేస్తున్నారు. ప్రధానమంత్రి ఉపాధికల్పనా పథకం కింద పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్న ఆలోచన ఇది...

Medicinal pads to solve the problem at vizianagaram district
ఔషధి ప్యాడ్స్‌... కష్టాన్ని తీర్చేందుకే!
author img

By

Published : Feb 19, 2021, 9:49 AM IST

తోటి గిరిజన స్త్రీల కష్టాలను చూస్తూ పెరిగారామె. ఎలాగైనా వాటికో పరిష్కారం అందించాలని తపన పడ్డారు శాస్త్రవేత్త రమాదేవి. విజయనగరం జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామం గదబ బొడ్డవలస ఆమె సొంతూరు. బాల్యమంతా అక్కడే గడిచింది. ఉన్నత చదువులు చదువుకుని ప్రస్తుతం వేంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో సహాయ ఆచార్యురాలిగా ఉన్న ఆమె ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో ఆచార్య గౌరీశంకర్‌ ఆధ్వర్యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. వీటి లక్ష్యం... స్త్రీల నెలసరి సమయాన్ని సౌకర్యవంతం చేయడం మాత్రమే కాదు... అనారోగ్యాలకు గురికాకుండా చూడ్డం కూడా అంటారామె. ‘పొలాల్లో పనిచేయడానికి వచ్చే ఆడవాళ్లు రక్తహీనత, తెల్లబట్ట, అధిక రక్తస్రావం, గర్భాశయ క్యాన్సర్‌ వంటి సమస్యలతో బాధపడటం చూశాను. ఇందుకు బాల్యవివాహాలు ఒక కారణం కాగా, నెలసరి సమయాల్లో వాళ్లు పాటించే అసురక్షిత విధానాలు కూడా. చైతన్యం లేక మాసినబట్టలు, అట్టలు, చెక్కలు, ఆకులు వంటివి వాడేవారు. వాళ్లలో అవగాహన తీసుకురావడానికి ప్రతి నెలలో రెండు మూడు సార్లు కొండపై గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించేదాన్ని. కానీ ‘అంత రేటు పెట్టి శానిటరీ న్యాప్కిన్లని కొనలేమమ్మా’ అనేవారు. అప్పుడే ‘ప్యాడ్‌మెన్‌’ లాంటి సినిమాల స్ఫూర్తితో తక్కువ ధరకు లభించే ఆరోగ్యకరమైన న్యాప్కిన్లు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది’ అంటారు రమాదేవి.
మూడు కోట్ల రూపాయల ఆర్డరు...
ఔషధ మొక్కల బెరడు, పండ్ల గింజలు, అడవి ఆకులు, కొన్ని రసాయనాలను ఉపయోగించి న్యాప్కిన్లు క్రిమి రహితంగా ఉండే మందును తయారు చేశారు రమాదేవి. 2019లో ఎన్‌ఐఆర్‌డీ నిర్వహించిన రీసెర్చ్‌ ఇన్నోవేటివ్‌ స్టార్టప్‌ పోటీల్లో ఈ ప్రయోగం ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికైంది. గతేడాది రాజమండ్రిలో నిర్వహించిన ఫార్మకాగ్నసి జాతీయ సదస్సులోనూ ప్రశంసలు అందుకుంది. ఈమె ఆలోచనకు మెచ్చిన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మధ్యప్రదేశ్‌ ఎన్‌ఐఆర్‌డీ రూ.3 కోట్ల విలువ చేసే ఆర్డర్లు ఇవ్వడానికి సిద్ధమైంది.
మరోవైపు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రూ.25 లక్షల సాయానికి ఎంపికయ్యారు. దీంతో త్వరలోనే ఉత్పత్తి యూనిట్‌ ప్రారంభించాలనుకున్నారు రమాదేవి. అయితే ఆ యూనిట్‌ని ఎక్కడో కాకుండా తన సొంతూర్లోనే ఏర్పాటు చేయాలనేది ఆమె కోరిక. ‘ఎందుకంటే మా ఊర్లో చాలామంది గర్భిణులు ఆ సమయంలో కూడా రాళ్లుకొట్టే పనికి వెళ్తుంటారు. అలాంటి మహిళలకు ఉపాధి కల్పించాలని గ్రామంలోనే యూనిట్‌ను పెట్టాలనుకున్నా’ అంటారామె.
పొలంలో పనిచేసే వారికోసం..
రమాదేవి పరిశోధనల్లో ఔషధి ప్యాడ్స్‌తో పాటూ దోమల నివారణ లేపనం, హెర్బల్‌ మాస్కులు, కాలి ఒరుపులను తగ్గించే మందుల వంటివీ ఉన్నాయి. వాటి పేటెంట్‌ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారామె. ‘ఔషధ బెరళ్లు, కొన్ని పండ్ల తొక్కలతో డెంగీ, మలేరియాకు కారణమయ్యే దోమల నివారణ లేపనాన్ని తయారుచేశాను. వర్షాకాలంలో రైతుల కాళ్లు తరచూ ఒరుపులకు గురై పగుళ్లు వస్తుంటాయి. వాటి నివారణకు కాళ్ల పగుళ్ల మందు వంటివి కూడా తయారు చేశా’ అనే రమాదేవి హెర్బల్‌ కాస్మొటిక్స్‌లో కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఔషధ మొక్కల వినియోగంపై ఆమె రాసిన ‘హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ ఫార్మకాగ్నసీ, ఫైటోకెమిస్ట్రీ’ పుస్తకం ఐదు విదేశీ భాషల్లోకి అనువాదమవ్వడం విశేషం.

ఇదీ చదవండి: రాజకీయ జీవితంలో ఎన్టీఆర్‌ లెజెండ్ ‌: ఉపరాష్ట్రపతి వెంకయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.