ETV Bharat / state

MANSAS TRUST: బకాయిలు చెల్లించాలని మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగుల ఆందోళన - ఏపీ తాజా వార్తలు

న్సాస్ ట్రస్ట్ కళాశాలల ఉద్యోగుల ఆందోళన
న్సాస్ ట్రస్ట్ కళాశాలల ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Jul 17, 2021, 3:19 PM IST

Updated : Jul 17, 2021, 8:35 PM IST

15:16 July 17

జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్

మాన్సాస్ ట్రస్ట్ కళాశాలల ఉద్యోగుల ఆందోళన

విజయనగరంలోని మాన్సాస్‌ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు ముట్టడించారు. పెండింగ్​ జీతాలు చెల్లించాలని ఆందోళనకు దిగారు. జీతాలు నిలిపివేయాలని ఈవో వెంకటేశ్వరరావు బ్యాంకుకు లేఖ రాయడంతోనే వేతనాలు నిలిచిపోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలుగా అరకొర జీతాలతోనే పనిచేస్తున్నా..ఈనెల పూర్తిగా నిలిపివేశారని మండిపడ్డారు. అడిగితే నాకేం తెలియదని ఈవో చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. మంగళవారంలోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కళాశాల ఉద్యోగులు ఆందోళన విరమించారు. 

ట్రస్ట్ ఛైర్మన్​ దృష్టికి సమస్యలు..

జీతాల సమస్యపై మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజును కళాశాల ఉద్యోగులు కలిశారు. అన్యాయంగా జీతాలు ఆపారని వాపోయారు. ట్రస్ట్‌ ఈవో పొంతనలేని జవాబిస్తున్నారని తెలిపారు. తమ జీతాల సమస్య పరిష్కరించాలని కోరారు.

'ఉద్యోగుల పట్ల ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావు తీరు సరికాదు. ట్రస్ట్‌లో నిధులున్నా జీతాలు ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి. కరోనా వేళ కూడా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఛైర్మన్ బాధ్యతలు చేపట్టినా నన్ను కలిసేందుకూ ఈవోకు తీరిక లేదు'- అశోక్‌గజపతిరాజు, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్

ఇదీ చదవండి:

Nominated posts: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన.. అతివకే అందలం

Last Updated : Jul 17, 2021, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.