విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పారన్నవలస, నార్లవలస గ్రామాల్లో 'మనం-మన పరిశుభ్రత' కార్యక్రమాన్ని ఈవోపీఆర్డీ వర్మ ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి రోజుకి రెండు రూపాయలను హరిత రాయబారులకు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని కోరారు.
చెత్త శుద్ధి నిర్వహణ కేంద్రాలకు హరిత రాయబారులు చెత్తను తీసుకొస్తారని... అక్కడి నుంచి సంపదను తయారు చేస్తారని ఉపాధి హామీ పథకం ఏపీవో సుశీల తెలిపారు. తద్వారా పంచాయతీకి ఆదాయం చేకూరేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.