విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలో మలేరియా నివారణకు అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వ్యాధి నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా పరీక్షలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి రక్త నమూనాలను సేకరించి క్షణాల్లో ఫలితాలు వెల్లడిస్తున్నారు. వ్యాధి ఉన్నట్టు తేలితే వెంటనే మందులను అందిస్తున్నారు. ప్రయాణికులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి.