విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో... ఎస్టీ జాబితాలో ఎస్సీ పైబడిన కులస్తులను కలపొద్దంటూ మహాధర్నా నిర్వహించారు. స్థానిక హెచ్ గ్రౌండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. గిరిజనుల హక్కులను కాపాడండి... ఎస్సీలను ఎస్టీ జాబితాలో చేర్చొకండి అంటూ... నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ మహాధర్నాలో కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల నుంచి గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చట్టాలు అమలుకు... గిరిజనుల ఆందోళన