విజయనగరం జిల్లా సాలూరు సర్కిల్ పోలీసులు.. బోస్ విగ్రహం నుంచి డీలక్స్ కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు చివరి రోజన.. నివాళులు అర్పిస్తూ, జోహార్లు పలికారు.
చీపురుపల్లిలో ఎస్సై దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో.. సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. వారి త్యాగాలు వర్ధిల్లాలని నినాదాలు చేశారు. గాంధీ విగ్రహం నుంచి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల త్యాగాలు మరువలేమని కొనియాడారు.
ఇదీ చదవండి: విజయనగరంలో ఘనంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు