ETV Bharat / state

బధిరులు, అధికారుల మధ్య వారధి.. ఈ లక్ష్మి - వందల మందికి మాటిస్తోంది

Story on Lakshmi Kondamma: తన మనసులో మాట భర్తకి అర్థమయ్యేలా చెప్పడం కోసం సైగల భాషని నేర్చుకున్నారామె. కానీ ఈ సమస్య ఆయనొక్కరిదే కాదని తెలిశాక వందలమంది బధిరులకు సాయం చేయడం మొదలుపెట్టారు. పోలీస్‌స్టేషన్లూ, బ్యాంకులూ, ప్రభుత్వ కార్యాలయాలు... ఇలా ఎక్కడ తన సాయం కావాలన్నా క్షణాల్లో అక్కడుంటారు విజయనగరానికి చెందిన బూరాల లక్ష్మీకొండమ్మ. బధిరులకు, అధికారులకు మధ్య వారధిగా మారిన లక్ష్మి స్ఫూర్తిగాథ ఇది..

special story on Lakshmi Kondamm
బూరాల లక్ష్మీకొండమ్మ
author img

By

Published : Feb 21, 2022, 1:48 PM IST

మాది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామం. నాన్న గురాల కోటేశ్వరరావు ఆర్టీసీ డ్రైవర్‌. అమ్మ పూర్ణలక్ష్మి గృహిణి. పదో తరగతిలో ఉండగానే బధిరుడైన మా దూరపు బంధువు శ్రీనివాసులుతో వివాహం అయ్యింది. ఆయనతో మాట్లాడాలంటే మొదట్లో అత్తయ్య, మరుదుల సాయం చేసేవారు. తర్వాత తను హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్‌గా చేరడంతో మేం కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నాం. ఆయనతో మాట్లాడటం కోసం సంజ్ఞల భాష నేర్చుకుందామని బధిరులకు అండగా ఉండే ఎన్‌ఐహెచ్‌హెచ్‌లో చేరాను. పూర్తిగా నేర్చుకునేలోపు మా పెద్దబ్బాయి కడుపున పడటంతో మధ్యలోనే ఆ చదువుని వదిలేశాను. తర్వాత మావారితో మాట్లాడుతూ క్రమంగా ఆ భాషలో నైపుణ్యం సంపాదించాను. చిన్నబాబు పుట్టేనాటికి తనకు విజయనగరంలో వైద్య, ఆరోగ్య శాఖలో ఎమ్‌ఎన్‌వోగా ఉద్యోగం వచ్చింది. దాంతో మేం తిరిగి విజయనగరం వచ్చేశాం.

బధిరుల సమస్యలు వినిపిస్తూ...

మావారు బధిరుల సంఘానికి ప్రధాన కార్యదర్శి. ఆయనతో కలిసి సమావేశాలకు వెళ్లేదాన్ని. అప్పట్నుంచే ఎవరైనా బధిరులకు ప్రభుత్వ ఆఫీసుల్లో పని ఉండి అధికారులతో మాట్లాడాల్సి వస్తే, సైగల భాషలో వారు చెప్పినదాన్ని అధికారులకు అర్థమయ్యేలా అనువాదం చేసి వివరించేదాన్ని. ఇలా ఎంతోమంది వారి భావాలను వ్యక్తపర్చడానికి వీలుకాక ఇబ్బందులు పడుతున్నారని తెలిసి.. నా వంతుగా సాయం చేయాలనుకున్నా. ఏం చేయాలన్నా చదువు ఉండాలి కాబట్టి దూర విద్య ద్వారా డిగ్రీ చేసి, స్పెషల్‌ బీఈడీ పూర్తిచేశాను.

పెషల్‌ ఎడ్యుకేషన్‌లో చివరి

సెమిస్టర్‌ రాసి ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా. సాధారణంగా బధిరులు మామూలు వ్యక్తుల్ని కాకుండా బధిరులనే వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ల మధ్య ఏవైనా మనస్పర్థలు వస్తే వాళ్లేం చెబుతున్నారో పోలీసులకు అర్థం కాదు. అలాంటప్పుడు కౌన్సెలింగ్‌ చేయడానికి అధికారులు నా సాయం కోరేవారు. అలాగే బధిరులకు పుట్టిన పిల్లల పెంపకం, చదువుల విషయంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. పసి పిల్లలతో ఎలా వ్యవహరించాలో వీళ్లకి కౌన్సెలింగ్‌ ఇస్తుంటాను. క్రమంగా అదొక పనిగా మారింది.

లైసెన్సులు ఇప్పించాను...

బధిరులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నో జీవోలూ, సంక్షేమ పథకాలూ తీసుకొస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు అధికారులకూ వాటిపై అవగాహన ఉండదు. అలాంటిదే బధిరులకు ఇచ్చే డ్రైవింగ్‌ లైసెన్సు సమస్య. వాళ్లకు వినపడదు కాబట్టి లైసెన్స్‌ ఇవ్వడానికి నిరాకరించేవారు. కానీ వినికిడి మిషన్లు వచ్చాక ఆ సమస్య నివారించగలిగాం. ‘ఇతర జిల్లాల్లో ఇస్తున్నారు, ఇక్కడే ఎందుకు ఈ సమస్య వస్తోంద’ని సంబంధిత అధికారులతో మాట్లాడి ఒప్పించాను. దాంతో వాళ్లు కూడా అర్థం చేసుకుని ప్రత్యేకంగా మేళా పెట్టించి ఒకేరోజు వంద మందికిపైగా లైసెన్సులు ఇచ్చారు. బధిరుల కోసం ఒక రాష్ట్రస్థాయి సంఘం ఉంటుంది. దీనిద్వారా జీవోలు, సంక్షేమ పథకాల గురించి వాట్సాప్‌ గ్రూపుల ద్వారా నాకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది.

చదువుకున్న వారికి ప్రభుత్వం వినికిడి ఉపకరణాలు, ఫోన్లు మంజూరు చేసింది. అవి వారికి చేరేట్టు చూశాను. ఒకసారి భార్యాభర్తలు ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పేస్లిప్పులు అన్నీ ఉన్నా.. వీళ్లతో మాట్లాడటం ఇబ్బంది కాబట్టి రుణం ఇవ్వలేమన్నారు. అధికారులతో చర్చించి వాళ్లకు లోన్‌ ఇప్పించాను. అలాగే విద్యార్హత ఉన్నవారికి ఉపాధి కల్పించాలని కొన్ని ప్రైవేటు కంపెనీలనూ సంప్రదించి వాళ్లనీ ఒప్పించా. ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’లో ప్రసంగాన్ని దూరదర్శన్‌ ద్వారా బధిరులకు వివరించడానికి గతంలో నన్ను విశాఖకు ఆహ్వానించారు. కొవిడ్‌ సమయంలోనూ బధిరులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేందుకు వీడియో కాల్‌ ద్వారా అందుబాటులో ఉండేదాన్ని. ప్రస్తుతం మా పిల్లలిద్దరూ బీటెక్‌ చదువుతున్నారు. దాంతో పూర్తిగా నా సమయాన్ని బధిరుల కోసమే కేటాయిస్తున్నా. - బూరాల లక్ష్మీకొండమ్మ

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.