విజయనగరం జిల్లా పార్వతీపురం రైతు బజార్ వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ఉల్లిపాయల కోసం క్యూలైన్లో నిలబడినా తమ వంతు వచ్చేసరికి అయిపోవటంతో ఆందోళనకు దిగారు.
రైతు బజార్లో ప్రభుత్వం రాయితీ మీద ఉల్లిపాయలు ఉదయం 11 గంటలకే అయిపోయాయి. దీనితో మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దూరప్రాంతాల నుంచి వచ్చామని... పలుమార్లు తిరిగినా ఉల్లి దొరకటం లేదని వాపోయారు. శుక్రవారం రాత్రి రెండు టన్నుల ఉల్లి రైతు బజార్‌కు చేరింది. ఉదయం 6 గంటలకు పంపిణీ ప్రారంభించారు. 5గంటల్లోనే స్టాక్ అయిపోవడంతో వందలాది మంది నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులను నిలదీస్తూ.. గ్రామ వాలంటీర్లతో ఉల్లిపాయలు పంపిణీ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. పోలీసులు రైతుబజార్‌కు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీ చూడండి