ETV Bharat / state

నిరాశాజనకంగా ముగిసిన ఖరీఫ్‌... - విజయనగరంలో ఖరీఫ్​ వర్షపాతం

ఈ ఏడాది ఖరీఫ్‌.. అన్నదాతకు కలిసి రాలేదు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వర్షం కానరాలేదు. కొన్నిచోట్ల అడపాదడపా కురిసినా.. కీలకమైన ఆగస్టులో వానల జాడ అంతగా లేకపోవడం.. రైతన్నకు ఆవేదన మిగిల్చింది. జూన్‌ 1న ఆరంభమైన సీజన్‌.. సెప్టెంబరు నెలాఖరుతో ముగిసింది. అనుకూలమైన వర్షాలు లేకపోవడంతో పంటలకు దెబ్బ పడింది. దీంతో అంతంతమాత్రంగానే సాగు సాగింది.

వర్షలేమి
ఖరీఫ్
author img

By

Published : Oct 1, 2020, 12:47 PM IST

విజయనగరం జిల్లాలో జూన్, జులై మాసాల్లో సాధారణ వర్షపాతాలు నమోదైనా.. పంటల సాగుకు పూర్తిగా సరిపోలేదు. 195.1 మి.మీ.లకు గాను ఆగస్టులో 92.6 మి.మీ నమోదైంది. వర్షాభావ పరిస్థితులు, వేసవిని తలపించే ఎండలతో ఆగస్టు నెలాఖరు నాటికి 29,478 హెక్టార్లలో వరి నారుమళ్లు ఎండిపోయాయి. ప్రస్తుతం చెరువుల్లో చేరిన కొద్దిపాటి నీటిని మోటర్లతో తోడుతూ పంటలకు జీవం పోస్తున్నారు రైతులు. వచ్చే రబీ సీజన్‌ కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Rainfall
వర్షపాతం

పంట సాగు ఇలా..

ఖరీఫ్‌లో జిల్లా మొత్తంమీద అన్ని పంటలూ కలిపి 1,81,811 హెక్టార్లలో సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 1,36,999 హెక్టార్లలో వివిధ పంటలు విత్తడం పూర్తయింది. దాదాపు 44,812 హెక్టార్ల మేర పంట వేసే పరిస్థితి లేకుండా పోయింది. వరిపంట సాధారణ విస్తీర్ణం 1,22,007 హెక్టార్లకు గాను 96,941 హెక్టార్లలో ఉభాలు జరగ్గా.. 25,066 హెక్టార్ల పంటపొలం కొర్ని భూమిలా ఉండిపోయింది. ఇతర పంటల పరిస్థితీ దాదాపు అలానే ఉంది.

Cultivation
పంటల సాగు

మొగ్గుచూపని రైతాంగం..

వరి నారుమళ్లు ఎండిపోయిన రైతాంగానికి 'ఎన్‌.ఎల్‌.ఆర్‌-34449' స్వల్పకాలిక రకం విత్తనాలను కిలో రూ.10 రాయితీపై అందించేందుకు వ్యవసాయశాఖ సన్నద్ధమైనా.. అన్నదాతలెవరూ ముందుకు రాలేదు. 6 వేల క్వింటాళ్ల ప్రతిపాదనలకు గాను 2 వేల క్వింటాళ్లు సిద్ధం చేసినా 30 క్వింటాళ్లు మాత్రమే గంట్యాడ మండల రైతులు తీసుకున్నారు. పూర్తి రాయితీపై విత్తనాలు అందజేస్తే బాగుండేదని పలువురు కర్షకులు వాపోతుతున్నారు.

గింజ కూడా దక్కలేదు..

నాకున్న రెండెకరాల్లో పంట వేద్దామనుకున్నా. వర్షాలు లేకపోవడంతో ఒక ఎకరాలోనే నారుమళ్లు సిద్ధం చేశా. ఇప్పుడు అదీ పూర్తిగా ఎండిపోయింది. ఈ ఏడాది గింజ కూడా దక్కని పరిస్థితి నెలకొంది. భూమి ఉన్నా పంట పండక.. బయట బియ్యం కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. - తర్లువాడ అప్పలనాయుడు, పినతాడివాడ, డెంకాడ మండలం

ఈ ఏడాది వర్షాలు పడే అవకాశం ఉన్నా, జిల్లాలో పరిస్థితుల దృష్ణ్యా.. పంటలకు అనుకూలంగా కురవలేదు. ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబరు మొదటి వారం లోపు ఎక్కువగా ఉభాలు జరుగుతాయి. అదే సమయంలో వర్షాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. వేలాది ఎకరాల్లో నారుమళ్లు ఎండిపోయాయి. - కెల్ల లక్ష్మణ్, ఏరువాక కేంద్రం, సమన్వయకర్త

ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.