ETV Bharat / state

మేమున్నాం.. మీకేం కాదంటూ సేవలందిస్తున్న నర్సులు!! - corona news

ప్రమాదంలో గాయపడి రక్తమోడుతున్న స్థితిలో ఆసుపత్రికి వచ్చే క్షతగాత్రులైనా.. విష ప్రభావంతో ప్రాణాపాయ స్థితిలో చేరిన బాధితులకైనా.. పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం వచ్చే మహిళలకైనా.. వైద్యుల కంటే ముందుగా వారే స్పందిస్తారు. ప్రథమ చికిత్స అందించి సాంత్వన చేకూర్చడానికి ప్రయత్నిస్తారు. ప్రాణ రక్షణకు తమ వంతు కృషి చేస్తారు. ఈ కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రాణాలకు తెగించి కోవిడ్ సోకిన రోగులకు సేవలు అందిస్తున్నది వారే.. ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే నర్సులు.

international nurses day
మీకేం కాదంటూ సేవలందిస్తున్న నర్సులు
author img

By

Published : May 12, 2021, 6:20 PM IST

అంతర్జాతీయ నర్సుల దినోత్సం సందర్భంగా నర్సుల మనసు మాటలు..

వైద్యసేవల్లో నర్సుల పాత్ర ఎంతో కీలకం. వైద్య పరిభాషలో చెప్పాలంటే.. ఆసుపత్రులకు నర్సులు 'కీ బోన్‌' లాంటి వారు. నర్సులు లేనిదే ఆసుపత్రి నిర్వహణ సాధ్యం కాదంటే వారి పాత్ర ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు. రాత్రింబవళ్లు అంకితభావంతో సేవలు అందించడం నర్సుల బాధ్యత. నేడు ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ సందర్భంగా వారి సేవలకు అందరూ కృతజ్ఞతలు చెబుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు ఏవైనా నర్సులు లేకుండా నిర్వహణ అసాధ్యం. తగినంత మంది నర్సులు ఉంటేనే సరైన రీతిలో వైద్యసేవలు అందించేందుకు వీలవుతుంది. వైద్యులు రోగ నిర్ధారణ చేసి తగిన మందులు రాయడం మాత్రమే చేస్తారు. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారికి సమయానుకూలంగా ఇంజక్షన్లు చేయడం, సెలైన్లు అమర్చడం, రక్తపోటు పరీక్షించడం, సమయానికి మందులు వేసుకునేలా చూడటం, గాయాలు తగిలిన, శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ప్రతిరోజు డ్రెస్సింగ్‌ చేయడం వంటి సేవలు అందించేది నర్సులే. రోగులు పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యే వరకు వారు అందించే సేవలు ఎన్నెన్నో.

ఈ రోజే ఎందుకంటే..?

ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌.. సేవలకు, అంకితభావానికి ప్రతీక. వైద్య సేవల విభాగంలో పని చేసే నర్సులు విధి నిర్వహణలో ఎలా వ్యవహరించాలనేదానికి ఆమె నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా నర్సులందరికీ ఆమే ఆదర్శం. 1820 మే 12న కొలంబియాలో జన్మించిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ యుద్ధ సమయంలో సైనికులకు ప్రశంసనీయమైన సేవలు అందించారు. అందుకు గుర్తుగా ఆమె జయంతి రోజైన మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ధైర్యమే వారిని కాపాడింది..

"నేను 12 ఏళ్లుగా నర్సుగా సేవలు అందిస్తున్నా. ఐదేళ్ల క్రితం ఓ గర్భిణీ ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చారు. ఆ సమయంలో ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. రక్త పోటు అతి తక్కువగా ఉంది. నాడీ వ్యవస్థ పని చేయటం లేదు. అయినా ధైర్యంగా కాన్పు చేశా. తల్లీబిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్లారు. ఆ రోజు నా ధైర్యమే వారికి రక్షగా నిలిచింది." - ఎస్.మణి, ఇంచార్జి హెడ్ నర్సు

ప్రజలకు సేవ చేయాలని..

"వైద్య వృత్తిలో ప్రజలకు మరింత ఎక్కువ స్థాయిలో సేవలు అందించటానికి అవకాశాలు ఉంటాయని ఈ వృత్తిని ఎంచుకున్నాను. 16 ఏళ్లుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాను. చాలా సంతృప్తికరంగా ఉంది. ఇన్నేళ్లలో వేల మందికి సేవలు అందించే అవకాశం కలిగింది. ఉద్యోగ విరమణ అయ్యేంత వరకు ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ ఉంటాను." - ఎం.సీత సీనియర్‌ నర్సు, కురుపాం

వారి మనోవేదన అర్ధం చేసుకుంటా..

"రోగులకు సేవలందించడమే కర్తవ్యంగా భావిస్తా. పలు సందర్భాల్లో మా ప్రమేయం లేకున్నా రోగుల బంధువులు పరుషంగా మాట్లాడతారు. ఇది మనస్సుకు ఎంతో బాధ కలిగిస్తుంది. ఆ సమయంలో వారి మనోవేదనను అర్థం చేసుకుంటా. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు చాలా మంది నిరుపేదలే. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నా." - శిల్పా, నర్సు

వృత్తే దైవంగా సేవలో..

వృత్తే దైవంగా భావిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నా. సమయపాలన పాటిస్తూ, ఆసుపత్రికి వచ్చే రోగులను ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వ వైద్యసేవల పట్ల నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నా. నిండు గర్భిణులకు కాన్పులు చేసి పసి బిడ్డలకు ప్రాణాలు పోసే అవకాశం నర్సుగా నాకెంతో సంతృప్తిని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో సత్కారాలు, చీత్కారాలూ ఉంటాయి. - మహేశ్వరి, నర్సు

నర్సుల సేవలు ఎనలేనివి..

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో నర్సుల సేవలు ఎనలేనివి. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి సమయంలో వీళ్ళు పాత్ర ఎనలేనివి.- శోభారాణి, డాక్టర్, కురుపాం, సిహెచ్​సీ

ఇవీ చదవండి:

బ్లాక్​ ఫంగస్​పై కేంద్రం అప్రమత్తం- డ్రగ్​ ఉత్పత్తికి ఆదేశం

కొవిడ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన అదనపు డీఎంహెచ్​ఓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.