విజయనగరం జిల్లాలో నిర్వహించే వినాయక చవితి పూజల కోసం... మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఐదేళ్లుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు పార్వతీపురం పట్టణంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు అందుబాటులోకి వచ్చాక... మట్టి విగ్రహాల తయారీదారులకు గడ్డు పరిస్థితి ఎదురైంది. పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేయటంతో... మళ్లీ మట్టి విగ్రహాల వైపు భక్తులు అడుగులు వేస్తున్నారు. పార్వతీపురంతో పాటు చుట్టుపక్కల ఆరేడు మండల ప్రజలు వాటిని వినియోగిస్తున్నారు. కేజీబీవీ గురుకుల పాఠశాల విద్యార్థులు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తూ... పర్యావరణ హితానికి తమ వంతు కృషి చేస్తున్నారు.
ఇదీ చూడండి: విజయనగరంలో ఘనంగా కృష్ణాష్ఠమి వేడుకలు