విజయనగరం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్కడక్కడా మరణాలు కూడా సంభవించటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయినప్పటికీ మార్కెట్లలో నిత్యావసర సరకులు కొనుగోలు చేసే ప్రజలు ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారని అధికారులు అంటున్నారు.
ముఖ్యంగా మద్యం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా ఉంటున్నారు. మాస్క్‌లు వినియోగించటం లేదని.. ప్రజలలో భయం పోయి విచ్చలవిడిగా అనవసరంగా తిరుగుతున్నారని తెలిపారు. విజయనగరం పట్టణంలో ఇలాగే కొనసాగితే కరోనాను కట్టడి చేయటం కష్టమని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా అవసరమైతే గాని బయటకు రావటం, భౌతికదూరం పాటించటం, మాస్క్‌లను ధరించటం వంటి జాగ్రత్తలు పాటించి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి