వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వివాహితను భర్తే గొంతు నులిమి చంపేశాడు. విజయనగరం జిల్లా సాలూరు పెద్ద కుమ్మరి వీధికి చెందిన చిట్టి రాజు, జలుమూరు విజయలక్ష్మి(45) దంపతులు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చిట్టిరాజు విజయలక్ష్మి గొంతు నులిమి హత్య చేశాడు. గతంలోనే విజయలక్ష్మిపై చిట్టి రాజు కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :