ETV Bharat / state

విడాకులకు ముందే మరో పెళ్లి.. భార్య ఆందోళన.. అత్తింటి కుటుంబీకుల దాడి! - రెండు కుటుంబాల మధ్య గొడవలు

మనసులు కలిశాయి ఇక మతంతో పనేంటనుకుంది ఆ జంట. జీవితాంతం కష్టసుఖాలను కలిసి పంచుకోవాలని నిర్ణయించుకొని.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కొంత కాలం అన్యోన్యంగా సాగిన వీరి బంధంలో.. కలతలు మెుదలయ్యాయి. కలిసి ఉండటం కష్టం అని భావించి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడిపోకుండానే.. తన భర్త మరొకరిని వివాహం చేసుకున్నాడని తెలిసి ఆ యువతి తట్టుకోలేకపోయింది. న్యాయం కావాలంటూ అత్తింటిని చేరింది. అటుపై...!

గొడవలు
attack
author img

By

Published : Mar 20, 2021, 3:21 PM IST

పాచిపెంట గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ..

విజయనగరం జిల్లా పాచిపెంటకు చెందిన షేక్ మదీనా అనే వ్యక్తికి.. శ్రావణి అనే అమ్మయితో 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలానికి వారి కాపురంలో కలతలు చెలరేగాయి. పోలీసులు, పెద్దలు సర్ది చెప్పినప్పటికీ.. కలిసి ఉండలేమన్న నిర్ణయానికి దంపతులు వచ్చేశారు. ఇరువురూ చట్టబద్ధంగా విడిపోవాలనుకున్నారు. కానీ... విడాకులు రాకుండానే తన భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న శ్రావణి.. అతడిని నిలదీయాలని పుట్టింటి వారితో కలిసి అత్తింటికి వెళ్లింది. అక్కడ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.

ఈ క్రమంలో పలువురికి గాయలవ్వగా.. స్థానికులు 108కి ఫోన్ చేసి ఇరువర్గాల వారిని సాలూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో... షేక్ మదీనా అక్క ఫాతిమా కత్తితో దాడి చేసినట్లు శ్రావణి, ఆమె తరఫు బంధువులు ఆరోపించారు. మరోవైపు.. ఫాతిమా వ్యవహారశైలిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికంగా వాలంటీర్ గా పని చేస్తున్న ఫాతిమా.. నిత్యం వీధుల్లో కత్తి పట్టుకుని తిరుగుతుంటారని ఆరోపించారు. ఈ రోజు శ్రావణి కుటుంబీకులకు జరిగిందే రేపు తమకూ జరుగుతుందేమో అని ఆందోళన చెందుతూ.. గ్రామ సచివాలయ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

రెట్టింపు నగదు పేరుతో మోసం.. మహిళ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.