ETV Bharat / state

'దాడులు చేసిన వారిని అరెస్టు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం' - విజయనగరం తాజా న్యూస్​

విజయనగరంలోని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకొనేందుకు వచ్చిన తమను అన్యాయంగా గృహ నిర్బంధం చేశారని హైందవ సంఘం ఐక్య వేదిక సభ్యుడు మారుతి మహానంద మండిపడ్డారు. హిందూ దేవాలయాల పై దాడులు చేసిన వారిని అరెస్టు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

HYNDAVA SAMAKYA SWAMIJEELU ARREST IN VIZANAGARAM
'దేవాలయాల పై దాడులు చేసిన వారిని అరెస్టు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'
author img

By

Published : Jan 5, 2021, 9:49 PM IST

విజయనగరం జిల్లా కేంద్రంలోని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన హైందవ సంఘం ఐక్య వేదిక సభ్యులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ ఘటన పై ఆ సంఘం సభ్యుడు మారుతి మహానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బయటకు వెళ్లకుండా ద్వారానికి తాళం వేసి రాక్షస పాలన చేస్తున్నారని ఆరోపించారు. హిందువుల ఓట్లతో గెలిచి, ఆంధ్ర రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా సృష్టించే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల పై దాడులు చేసిన వారిని అరెస్టు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదని విమర్శించారు. అరెస్టయిన వారిలో విజయవాడకు చెందిన పూజా శివ స్వామిజి, కాకినాడకు చెందిన మారుతి మహానంద, భవానీ, సాకారానంద, భారతా నంద స్వామీజీ ఉన్నారు.

ఇదీ చదవండి:

పక్కా ప్రణాళికతోనే రామతీర్థం ఆలయంపై దాడి: సీఐడీ అదనపు డీజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.