విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,750 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,423 క్యూసెక్కులుగా ఉంది. తాటిపూడి జలాశయంలో 289.80 అడుగులకు నీటిమట్టం చేరింది. పాచిపెంట మండలం మోసూరులో కాజ్ వే కొట్టుకుపోయింది. మెంటాడ, గజపతినగరం మండలాల్లో వర్షాలకు చంపావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మెంటాడ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్యామాయవలసలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభం నేలకొరిగింది. గంగచోళ్లపెంట వద్ద రహదారిపై వృక్షం కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం
ప్రాంతం పేరు | వర్షపాతం(సెం.మీ) |
భోగాపురం | 11.1 |
కొత్తవలస | 10.6 |
డెంకాడ | 8.2 |
వేపాడ | 7.9 |
పూసపాటిరేగ, జామి, మెంటాడ | 7 |
లక్కవరపుకోట, విజయనగరం | 6 |
గరివిడి, పాచిపెంట, గుర్ల, గుమ్మలక్ష్మీపురం | 6 |
గరుగుబిల్లి, సాలూరు, రామభద్రపురం | 5 |
పార్వతీపురం, గరుగుబిల్లి | 5 |
రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక