ETV Bharat / state

విజయనగరంలో వర్షం.. ప్రజలకు ఉక్కపోతనుంచి ఉపశమనం

author img

By

Published : Jul 4, 2021, 10:53 PM IST

విజయనగరం జిల్లాలో విపరీతమైన ఎండలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. జిల్లాలో ఇవాళ మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు రహదారులు జలమయమయ్యాయి.

heavy rain fall at vizianagaram
వర్షంతో విజయనగరం వాసులకు ఉపశమనం

విజయనగరం పట్టణంలో కొన్ని రోజులుగా విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే అధికంగా ఎండలు ఉండటంతో.. స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఉక్కపోతకు ఉపశమనాన్నిస్తూ.. జిల్లా కేంద్రంలో ఇవాళ మూడు గంటల పాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.

జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్​టీసీ కాంప్లెక్స్, తోటపాలెం, అరుణా జ్యూట్ మిల్ సహా పలు ప్రదేశాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి.

ఇదీ చదవండి:

రూ.12 కోట్ల విలువైన తిమింగలం లాలాజలం స్వాధీనం.. ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.