Grandfather and Grandson Died: విజయనగరం జిల్లా లచ్చరాయిపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి దిగి తాతా మనవళ్లు మృతి చెందారు. స్నానానికి వెళ్లినవారు ఇంటికి రాకపోవడంతో స్థానికులు చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభించాయి. లచ్చరాయిపురం గ్రామానికి చెందిన బోర రాము, బోర గౌతం తాతామనవళ్లు భవాని మాల ధరించారు. తాతామనవలిద్దరూ కలిసి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు. లోతుగా ఉండటంతో స్నానానికి దిగినవారు నీళ్లలో మునిగిపోయారు. స్నానానికి వెళ్లినవారు తిరిగి రాకపోవటంతో తోటి భవాని మాలధారులు, స్థానికుల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహాలు లభించాయి.
తాతమనవళ్ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: