అతనికి 54 ఏళ్ల వయస్సు... ప్రభుత్వ ఉద్యోగం... ఉన్నట్టుండి ఏమి జరిగిందో తెలియదు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదం విజయనగరం జిల్లా చినమేరంగి పెదబట్టి వద్ద జరిగింది. మృతుడు జిమ్మయ్యవలస మండలం సీమలవాని వలస ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుడు చిలకల తాతయ్యగా గుర్తించారు. విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు సమాచారం పంపించినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు విచారిస్తున్నట్లు ఎస్ఐ శివ ప్రసాద్ వివరించారు.
ఇదీ చదవండి: విజయనగరం రైల్వేస్టేషన్లో బాంబు.. భయం.