విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక ఉపాధ్యక్షురాలిగా 15వ వార్డు నుంచి వైకాపా తరఫున కౌన్సిలర్‌గా ఎన్నికైన గొలగాన రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు, పురపాలక ప్రత్యేక అధికారి, జిల్లాసంయుక్త కలెక్టర్ వెంకటరావు ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఇద్దరు ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినా.. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాలేదు.
ఈ కారణంగా.. ఒకే ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించామని ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు తెలిపారు. నోటిఫికేషన్ వచ్చాక 19వ వార్డుకు చెందిన చెలికాని వెంకట మురళీకృష్ణను మరో స్థానానికి అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. సభ్యుల ఆమోదం మేరకు ముందుగానే మురళీకృష్ణ పేరును సమావేశంలో ప్రకటించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన 14వ వార్డు కౌన్సిలర్‌కి గౌరవ సభ్యులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి:
విశాఖ ఉక్కుపై హైకోర్టులో ఐపీఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ పిల్