విజయనగరం జిల్లా పార్వతీపురంలో దళిత సంఘాల నాయకులతో కలిసి మాజీఎమ్మెల్యే చిరంజీవులు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై హైకోర్టు... సీబీఐ విచారణకు ఆదేశించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమంజసంగా లేవంటూ హైకోర్టు ఒకే రోజు 3 అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయటం సరికాదని... అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ జీవోను రద్దు చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మేలు జరిగేలా చూడాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: