ETV Bharat / state

కళ్ల ముందు పూలు...కన్నీళ్లతో రైతులు

లాక్‌ డౌన్‌ ప్రభావం... పూల రైతులపైనా పడింది. కోతకొచ్చిన పూలనూ అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పూజలు, శుభకార్యాలు లేక... వాటి వినియోగం పూర్తిగా పడిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

flower farmers problems in vizayanagaram
విజయనగరం జిల్లాలో పూల రైతుల కష్టాలు
author img

By

Published : Apr 7, 2020, 2:10 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్‌ వల్ల...రాష్ట్రంలో పూలరైతులు...నష్టాల్లో కూరుకుపోతున్నారు. విజయనగరం జిల్లాలో ప్రధానంగా 8 మండలాల్లో పూలు సాగవుతుంటాయి. అయితే ప్రస్తుతం శుభకార్యాలేవీలేక.... పూల సేకరణ, తరలింపు, హోల్‌సేల్‌ కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏటా ఈ సీజన్‌లో రోజుకు టన్నుకు పైగా పూల వ్యాపారం జరిగేదని, ఇప్పుడు ఆ ఊసేలేదని రైతులు వాపోతున్నారు.

విజయనగరం జిల్లాలో పూల రైతుల కష్టాలు

పూలు కొనేవారు లేక...రైతులు కోయడం మానేస్తున్నారు. అవి అలాగే వడలిపోయి పొలాల్లోనే రాలిపోతున్నాయి. పూలతోటల కోసం వెచ్చించిన పెట్టుబడి తిరిగొచ్చే పరిస్థితిలేదని... రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

వ్యవసాయ రంగానికి, ఉత్పత్తులు విక్రయానికి, కూలీల తరలింపుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా., క్షేత్రస్థాయిలో కార్యచరణకు నోచుకోట్లేదు. ఉత్పత్తుల అమ్మకానికి రైతులకు లాక్ డౌన్ ఆంక్షల నుంచి సడలింపు లభిస్తున్నా... వాటి కొనుగోలుదారులు, విక్రయదారులకు ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో ప్రధాన పంటల సాగు రైతులతో పాటు....పూలసాగుదార్లకు ఇబ్బందులు, నష్టాలు తప్పటం లేదు.

ఇవీ చదవండి...కరోనా...'ఈ' చదువుకు అడ్డే కాదన్నా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.