ETV Bharat / state

36 పరిశ్రమలకు తొమ్మిది మాత్రమే మిగిలాయి! - ఏపీలో పరిశ్రమల ఇబ్బందులు

రాష్ట్రంలో మూతపడుతున్న పరిశ్రమల జాబితాలోకి పెర్రో ఇనుము ఉత్పత్తి చేసే పరిశ్రమలూ చేరుతున్నాయి. దేశీయ విపణిలో ప్రతికూల పరిస్థితులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు లేకపోవటంతో ఈ రంగం కుదేలవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 27పరిశ్రమలు మూతపడగా.... మిగిలినవి ఆ దిశగా అడుగులు వేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ferro alloys industries in AP are closing
ఫెర్రో పరిశ్రమ
author img

By

Published : Dec 5, 2019, 8:04 AM IST

36 పరిశ్రమల్లో 9 మాత్రమే మిగిలాయి!

ఇనుము తయారీ ముడిసరుకులో ఫెర్రో అల్లాయిస్ మాంగనీసు ఒక్కటి. గనుల్లో లభించే మాంగనీసుని శుద్ధి చేసి, స్వచ్ఛమైన సరుకును ఈ పరిశ్రమలు ఉక్కు తయారీ కర్మాగారాలకు అందచేస్తాయి. విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు ముడి పదార్థాల దిగుమతి, ఉత్పత్తుల ఎగుమతుల కోసం నౌకాశ్రయం సౌలభ్యం దృష్ట్యా... ఆంధ్రప్రదేశ్​లో 36 పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమల ఫెర్రో అల్లాయిస్ ఉత్పత్తులు 60నుంచి 70శాతం విదేశాలకు ఎగుమతి అవుతాయి. అలాంటి పరిశ్రమలు ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి.

కొరవడిన రాయితీలు... పెరిగిన ఖర్చులు
ప్రస్తుతం విద్యుత్తు సంస్థలు ధరలు విపరీతంగా పెంచాయి. పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఫెర్రో అల్లాయిస్ కర్మాగారాలకు ఈ పరిస్థితుల్లో విద్యుత్తు రాయితీ లభించకపోవటం గొడ్డలి పెట్టుగా మారింది. దీనితో పాటు అంతర్జాతీయంగా ఉక్కు ధరలు భారీగా పడిపోయాయి. దీని ప్రభావం ముడిసరుకుగా వినియోగించే ఫెర్రో లోహాలపై పడింది. మరోవైపు ఈ పరిశ్రమకు అవసరమైన ప్రధాన ముడిసరుకు మాంగనీసు ఖనిజంతో పాటు.... కోల్, కోక్, ధరలు తగ్గకపోవటంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ఉత్పత్తి తగ్గిపోవటంతో.... ఉక్కు పరిశ్రమలు ఫెర్రో అల్లాయిస్ కర్మాగారాల ఉత్పత్తులను కొనుగోలు చేయటం లేదు. దీనివల్ల దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా ఏపీలోని ఫెర్రో అల్లాయిస్ ఉత్పత్తులకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థిక నష్టాలను తట్టుకోలేక ఒక్కొక్కటిగా మూతపడుతూ రాష్ట్రంలోని 36 ఫెర్రో కంపెనీల్లో ప్రస్తుతం 9 మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో 6 కూడా పాక్షికంగానే ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి.

పరిశ్రమల మూత..... కార్మికుల కడుపు కోత
రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని ఒనగూర్చే ఫెర్రో కర్మాగారాలకు ప్రోత్సాహకాలు కొరవడటంపై పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. విద్యుత్తు బిల్లులు భారంగా మారిన నేపథ్యంలో విద్యుత్తు రాయితీలను కల్పించి పరిశ్రమలను ఆదుకోవాలని ఫెర్రో మిశ్రమాల ఉత్పత్తిదారుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్రో పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూత పడుతుండటంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఉన్నపలంగా ఫ్యాక్టరీలు మూసివేస్తుండటంతో.... కార్మికులు వలస కూలీలుగా మారుతున్నారు.

ఫెర్రో పరిశ్రమల మూత కారణంగా వివిధ రూపాల్లో ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో పాటు.. వేలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోతున్న తరుణంలో పాలక ప్రభుత్వాలు స్పందించాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇదీ చదవండి

సింహం, నేనూ గడ్డం గీసుకోం..!: పవన్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.