Farmers protest for shift A herd of elephants: విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేపట్టారు. గత మూడేళ్లుగా వేల ఎకరాల్లో తమ పంటలను ఏనుగుల గుంపు నష్టపరుస్తున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వాపోయారు. కేవలం పండించిన పంటలే కాకుండా ఇప్పటికే చాలా మంది ఏనుగుల బారిన పడి ప్రాణాల పోగొట్టుకున్న సంఘటనలున్నాయని ఆవేదన చెందారు. ఇంత జరుగుతున్నా ఏనుగులను ఇక్కడినుంచి తరలించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
శుక్రవారం పెద్దఎత్తున కొమరాడ మండలం అర్తం కూడలి వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏనుగుల గుంపును తరలించి తమ పంటలను, ప్రాణాలను కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి :
Villagers Problem: వంతెన కూలిపోయింది.. ఆ ఊరి వాళ్ల బతుకులు ఆగమయ్యాయి