Farmers Problems due to Unexpected Rains : ఖరీఫ్ ఆరంభం రైతాంగాన్ని మురిపించినా.. పంటల కీలక దశలో వర్షాలు ముఖం చాటేశాయి. చినుకు నేల రాలకపోవటంతో.. లోటు వర్షపాతం నెలకొంది. ఈ పరిస్థితుల్లో చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు ముప్పుతిప్పలు పడ్డారు. ముఖ్యంగా వరి సాగుదార్లు వేలాది రూపాయలు వెచ్చించి ఇంజన్లతో సాయంతో నీరు పెట్టి పంటను కాపాడుకున్నారు. చివరికి తిండి గింజలైనా దక్కుతాయని ఆశపడిన రైతుల్ని.. ప్రస్తుత తుఫాను ప్రభావంతో కురుస్తున్న చిరుజల్లులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకోసిన వరి పనలను పొలంలోనే ఆరబెట్టిన రైతులు మరింతగా కలవరపడుతున్నారు.
రైతన్నలను ముంచిన వర్షాలు - పంటను కాపాడేందుకు నానావస్థలు
Farmers Problems due to Unexpected Rains : విజయనగరం జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 2,23,025 ఎకరాలు కాగా.. 2,31,722 ఎకరాల్లో సాగైంది. అయితే జిల్లాలో వరి పంట ఒక్కోచోట ఒక్కోలా కనిపిస్తోంది. కోతలకు కాస్త దగ్గరలో ఉన్న పొలాలున్నాయి.. అలాగే పనలపైనా ఇంకోన్ని ఉన్నాయి.. కొన్నిచోట్ల కోతలు పూర్తి చేసి రైతులు కుప్పలుగా పెట్టుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పంటను కోసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల మొదటి వారానికే కొన్ని ప్రాంతాల్లో వరి కోతకు వచ్చింది. దీంతో ఇప్పటి వరకు 12 శాతం వరకు కోతలు పూర్తయ్యాయి.
Problems of Farmers in Vizianagaram District : ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. సోమ, మంగళవారాల్లో తేలిక పాటి జల్లులు కురవడంతో కొన్ని చోట్ల పంట తడిచింది. ప్రస్తుతం పంట ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రస్తుత వర్షాలకు నష్టమేనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోతకోసి పనలను పొలంలోనే ఆరబెట్టిన వారు మరింత కలవరపాటుకు గురవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదలైన దగ్గర నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదు. అన్ని అవరోధాలు తట్టుకొని చివరికి పంట చేతికి వచ్చేసరికి ప్రతికూల వాతావరణం నెలకొనడంతో నిరాశ చెందుతున్నారు.
అకాల వర్షాలతో రైతుకు తీవ్ర నష్టం.. పూర్తిగా తడిచిపోయిన ధాన్యం
Present Situation of Farmers in AP : అదేవిధంగా.. జిల్లాలోని శృంగవరపుకోట మండలంలోని.. కాపుసోంపురం, కృష్ణమ హంతిపురం, రాజీపేట, ఎస్.కోట, వినాయకపల్లి, తలారి, సంతగవిరమ్మపేట, పోతనాపల్లి, గోపాలపల్లి తదితర గ్రామాల్లో కోతలు మొదలయినప్పటికి.. దీపావళి తరువాత అల్పపీడనం హెచ్చరికతో కోతలకు విరామం ఇచ్చారు. ఆ ముప్పు తొలగిపోవటంతో రైతులు తిరిగి కోతలు ప్రారంభించారు. ఇప్పటికే పంట పక్వాదశకు రావటంతో ఎక్కడ గింజలు రాలిపోతాయోనని రైతులు కోతలకు దిగారు.
crops damage: పోటెత్తిన గోదావరి.. ముంపు ప్రాంతాల పంటలు జలమయం
తుఫాను ప్రభావంతో సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు కురిసిన చిరుజల్లులకు విజయనగరంజిల్లా వ్యాప్తంగా వరి పనలు తడిసిపోయాయి. చీపురుపల్లి మండలంలో 6,600 ఎకరాల్లో సాగు చేయగా.. 1000 ఎకరాల్లో కోసిన పంట పొలాల్లోనే ఉంది. ప్రస్తుత చిరుజల్లుల కారణంగా మొలకలు వస్తాయేమోనన్న భయం రైతుల్ని వెంటాడుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక రైతులు అయోమయానికి గురవుతున్నారు. అయితే.. రెండు రోజుల పాటు వరికోతల వద్దని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. పొలాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.