విజయనగరం జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు, మక్కువ సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో రోడ్ పక్కన కరోనా బొమ్మ పెట్టించారు. భౌతిక దూరం పాటించాలనని.. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని.. ఈ బొమ్మ సాయంతో అవగాహన కలిగిస్తున్నారు.
అలాగే.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోందని.. ఈ సమయంలో ఎవరైనా బయటకు వస్తే వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కరోనా నిబంధనలను ఈ బొమ్మతో చెప్తే ప్రజలకు అర్థమవుతుందనే.. రహదారి మధ్యలో పెట్టినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: