Minister BC Janardhan Reddy on Roads Constructions in AP: రాష్ట్రంలో సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు ఏర్పాటుకు పూర్తి సన్నాహాలు చేస్తున్నామని రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్ నిర్వీర్యం కావడం జరిగిందన్నారు.
సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లు బాగుపరచడానికి 861 కోట్ల రూపాయలు విడుదల చేశారని తెలిపారు. ఆ పనులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మురంగా జరుగు తున్నాయని గర్వంగా చెప్పగలమని మంత్రి అన్నారు. జీవో 53, జీవో 349 ప్రకారం కడప జిల్లాలో మొదటి దశ పనులకు 33.58 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల పనులు కూడా మొదలుపెట్టి కన్వర్షన్ కింద తీసుకు రావడం జరిగిందని వెల్లడించారు.
ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ - రిజిస్ట్రేషన్ సంబంధం లేకుండానే అనుమతులు
గతంలో స్టేట్ హైవే, నాబార్డ్, ఎన్డీబీ క్రింద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు, దాంతో వారు పనులు చేయలేదని తెలిపారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లును చెల్లించకపోవడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇప్పుడు ఎన్డీబీకి రూ.240 కోట్లు చెల్లించగా, రూ.5 వేల కోట్ల పనులు మొదలు పెట్టారని మంత్రి తెలిపారు. అలానే రోడ్లు సరిగా లేకపోవడం వల్లనే పరిశ్రమలు తరలిపోవడం, టూరిజం డెవలప్ కాకపోవడం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను చూడాలన్నదే కూటమి ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ప్రతి మూడు రోజులకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు.
వైఎస్సార్సీపీ పాలనలో ఆర్‌అండ్‌బీ డిపార్ట్‌మెంట్ నిర్వీర్యం అయ్యింది. అంతే కాకుండా స్టేట్ హైవే, నాబార్డ్, ఎన్డీబీ ద్వారా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. అలా బిల్లులు చెల్లించకపోవడంతో గతంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్డీబీకి రూ.240 కోట్లు చెల్లించగా రూ.5వేల కోట్ల పనులు మొదలుపెట్టారు.- బీసీ జనార్ధన్‌రెడ్డి, మంత్రి
ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
వ్యాపారంలో నష్టం - రాత్రికి రాత్రి కోటేశ్వరుడు కావాలని ప్లాన్ - చివరికి ఏమైందంటే!