యునిసెఫ్, జాతీయ గ్రామీణాభివృద్ధి సంయుక్తంగా నిర్వహించిన 7వ వాటర్, శానిటేషన్, అండ్ హైజీన్ (వాష్) సదస్సులో విజయనగరంజిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన ఉత్తమ అభ్యాసాలపై ప్రసంగించారు. కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన కొంతమంది ఐ.ఏ.ఎస్. అధికారులు ఈ వర్చువల్ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి పశ్చిమ గోదావరి కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, విజయనగరం కలెక్టర్ హరి జవహర్ లాల్ ఈ సదస్సులో పాల్గొనే అవకాశం లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గవర్నర్ కీలకోపన్యాసం అనంతరం జిల్లాలో నీటి నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలల్లో చేపట్టిన ఉత్తమ అభ్యాసాలను జిల్లా కలెక్టర్ వివరించారు.
జల సంరక్షణకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు సేవ్ బ్లూ, స్ప్రెడ్ గ్రీన్ నినాదంతో పనిచేస్తున్నామని తెలిపారు. సేవ్ బ్లూ కార్యక్రమం పేరుతో చెరువుల అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టామని... ఇంకుడు గుంతలు, మేజిక్ పిట్స్ నిర్మించామన్నారు. చెరువు గట్ల సుందరీకరణ, వాకింగ్ ట్రాక్స్, సీటింగ్ ఏర్పాటు, భూగర్భ జలాలు పెంచడానికి మొక్కలు నాటుతున్నాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రజలు స్వచ్చందంగా భాగస్వామ్యులయ్యేలా చేశామన్నారు.
కోవిడ్-19 రెండో సారి వ్యాప్తి చెందకుండా 50 రోజుల అవగాహనా కార్యక్రమానికి ప్రణాళిక రుపొందించామని... జిల్లాను గ్రీన్ జోన్లో ఉంచడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ హరి జవహర్ లాల్ ఈ సదస్సులో వివరించారు.
ఇవీ చూడండి...