విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ సామగ్రిని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పంపిణీ చేశారు. హెల్మెట్, కళ్లజోడు, మాస్కులు, ఏప్రాన్, షూ, శానిటైజర్లను అందించారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో హరిత రాయబారులకు సామగ్రిని అందజేశారు. కరోనా నియంత్రణలో భాగంగా గ్రామాల్లో వీధులు పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు.
ఇదీ చూడండి: