భోగాపురం విమానాశ్రయ పనులపై అధికారుల సమీక్ష
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో పర్యటించిన మౌలిక వసతుల పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికల్ వలవన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని... భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.
విమానాశ్రయానికి కేటాయించిన ప్రాంతాన్ని పటంలో పరిశీలిస్తున్న ప్రత్యేక కార్యదర్శి కరికల్ వలవన్
ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, భూసేకరణ పూర్తై వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ మౌలికవసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికల్ వలవన్ అన్నారు. బుధవారం భోగాపురం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి ప్రతిపాదించిన రావివలస ప్రాంతంలో జిల్లాస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టరు హరిజవహర్‌లాల్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ సీఈవో మీనాశర్మ, సంబంధిత అధికారులతో సమీక్షించారు. గతంలో 5,311 ఎకరాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారని, ఇందులో 2624 ఎకరాలు మాత్రమే అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఇప్పటికే 90శాతం మేర భూసేకరణ పూర్తయిందని, మరో 250 ఎకరాలు సేకరించాల్సి ఉందని వివరించారు. కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, వీరూ భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారన్నారు. పోలిపల్లి, గూడెపువలస ప్రాంతాల్లో 51ఎకరాల భూమిని సేకరించి పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయరహదారి నుంచి అనుసంధాన రహదారి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. విమానాశ్రయ ప్రతిపాదిత భూములను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జీసీహెచ్.కిశోర్‌కుమార్, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉపకలెక్టరు కె.బాలాత్రిపుర సుందరి, సీహెచ్.రామకృష్ణ, ఆర్డీవో హేమలత, సందీప్, తహసీల్దారు అప్పలనాయుడు, సర్వేయరు రాజు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదీ చదవండి:
Intro:భూ సేకరణ పూర్తయిన వెంటనే విమానాశ్రయం పనులు ప్రారంభం
* ప్రభుత్వ మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కారికల్ వలవన్
Body:ప్రపంచంలోనే గుర్తింపు వచ్చే దిశగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని భూ సేకరణ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వం మౌలిక వసతుల పెట్టుబడుల శాఖ ప్రత్యేక కార్యదర్శి కారికల్ వలవన్ అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం భోగాపురం మండలం పర్యటనలో భాగంగా విమానాశ్రయ ప్రాధాన్యత ప్రాంతంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ ఎయిర్ పోర్ట్ అధారిటీ సీఈఓ చర్మ సంబంధిత అధికారులతో మాట్లాడారు గతంలో 5311 ఎకరాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని ఇందులో కేవలం 2624 ఎకరాలు మాత్రమే ఇప్పుడు అవసరం ఉంటుందన్నారు 90 శాతం వరకు మరో 250 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు పోలిపల్లి ప్రాంతాల్లో 50 ఎకరాల భూమిని సేకరించి పునరావాస కాలనీలు ఏర్పాటు జరుగుతున్నాయన్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో భూసేకరణ జరక్కుండా గతంలో శంకుస్థాపన చేయడం జరిగిందని ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని వారు భవిష్యత్తులో ఈ ప్రాంతమంతా ఒక సిటీ వాతావరణం కనిపిస్తోందని కమర్షియల్ డెవలప్మెంట్ విడిభాగాల తయారీ కేంద్రం హోటల్ ఎడ్యుకేషన్ సొసైటీ వచ్చే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్ ప్రత్యేక కలెక్టర్ సిహెచ్ రామకృష్ణ హేమలత సందీప్ తాసిల్దార్ అప్పలనాయుడు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
Conclusion:భోగాపురం న్యూస్ టుడే