విజయనగరం జిల్లా పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయానికి వెళ్లే మార్గంలో ప్రాంతీయ ఆసుపత్రి ఎదురుగా ప్రమాదం పొంచి ఉంది. పశు వైద్య కేంద్రం ప్రహరీ పక్కన తురాయి, అశోక చెట్లు ఉన్నాయి. వాటిలో చాలా చెట్లు బొర్ర విడిచాయి. తురాయి చెట్ల మొదళ్ళు పుచ్చిపోయాయి. గాలి వీస్తే పడిపోయే స్థితిలో ఉన్నాయి.
రానున్నది వర్షాకాలం కావడంతో ఏ క్షణంలో చెట్లు కూలతాయో అని జనం భయపడుతున్నారు. ఆసుపత్రి పని మీద వచ్చే చాలా మంది చెట్ల నీడ కింద వాహనాలు ఉంచుతున్నారు. ఏ ప్రమాదం జరగకముందే బొర్రవిడిచిన చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీచదవండి: రేషన్ ఇచ్చేందుకు డీలర్ల కుర్చీ పాట్లు