వారాంతపు సంతల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 53,600 నగదు, తయారీకి వినియోగించిన స్కానింగ్ యంత్రాలను పట్టుకుని సీజ్ చేసినట్లు డీఎస్పీ మోహన్ రావు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం చెందిన కాసుల సంగమేశ్వర రావు కర్రీ గణపతి, సంతోష్, తూముల సింహాచలంతో పాటు విశాఖ జిల్లా భీమిలి చెందిన త్రాసుల సూర్యనారాయణ అనే వ్యక్తుల్ని ఈ కేసులో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బలిజిపేట, మానాపురం ప్రాంతాల్లో ఈ నోట్లను చలామణి చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఒరిజినల్ నోట్లను ప్రింటర్ సహాయంతో స్కానింగ్ చేసి.. నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. వారాంతపు సంతలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డీఎస్పీ సూచించారు.
ఇదీ చదవండి:
DRUGS: హైదరాబాద్‌లో 3 కిలోల డ్రగ్స్ పట్టుకున్న ఎన్‌సీబీ.. నిందితుడు అరెస్ట్