విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఓ గవర్నమెంట్ మద్యం దుకాణంలో అక్రమాలు జరిగాయి. పై అధికారుల ఆదేశాలతో బుధవారం సాయంత్రం ఎక్సైజ్, పోలీసులు సంయుక్తంగా రెండు మద్యం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. వీటిలో మక్కువలోని నంబర్ 2178 మద్యం దుకాణంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 21.03.2020 నాటి బ్యాలెన్స్ షీట్తో ఇప్పటి మద్యం సీసాలను సరిచూడగా 1,71,370 రూపాయలు తేడా వచ్చింది. ఆ మొత్తాన్ని మద్యం దుకాణం సూపర్వైజర్ మణికంఠ దగ్గర రికవరీ చేశారు. అనంతరం అతన్ని సూపర్వైజర్ స్థానం నుంచి తొలగించారు. దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ బాల నరసింహులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆ జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదు... కారణమిదే!