ETV Bharat / state

ఆగిన కరోనా పరీక్షలు.. మరింత ఆలస్యంగా ఫలితాలు

విజయనగరంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. అయితే జిల్లాలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిలిపివేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు నేరుగా వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఫలితం రావటానికి కనీసం వారం రోజులు సమయం పడుతుండటంతో.. బాధితులు ఇతరులతో కలిసి తిరుగుతున్నారు. ఇది... వైరస్ మరింత వ్యాప్తికి కారణమవుతుంది.

corona tests stopped
corona tests stopped
author img

By

Published : May 4, 2021, 6:04 PM IST

విజయనగరం జిల్లాలో మూడు రోజులుగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిలిపివేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు నేరుగా వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. అతి ముఖ్యమైన ఆర్‌టీపీసీఆర్‌ ఫలితం కనీసం మూడు నుంచి వారం రోజులు ఎదురుచూస్తే గానీ రావడం లేదు. తనకు పాజిటివా? నెగిటివా? అనేది తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఇంతలో కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి తిరిగేస్తున్నందున వారు కూడా బాధితులవుతున్నారు. వైరస్‌ వ్యాప్తికి ఇది కూడా ఒక కారణం.

పాజిటివ్‌ బాధితుల్లో శ్వాస తీసుకోవడం, అత్యవసర వైద్యం అవసరమైన వారి కోసం జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి 31 కొవిడ్‌ ఆసుపత్రులను ఎంపిక చేశారు. ప్రస్తుతం 20 ఆసుపత్రుల్లోనే చికిత్స అందుతోంది. వీటిలో మిమ్స్‌, కేంద్ర ఆసుపత్రి, పార్వతీపురం ఏరియా ఆసుపత్రులే కీలకంగా మారాయి. బాధితుల్లో వేగంగా కోలుకునే అవకాశం ఉండి, ఇంటి దగ్గర ఏకాంతంగా ఉండే అవకాశం లేని, కుటుంబ సభ్యులకు సోకకుండా ఉండే పరిస్థితులు లేని వారిని కొవిడ్‌ కేంద్రాలకు పంపిస్తారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా అయిదు కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, 1300 పడకలు సిద్ధం చేసినట్లు అధికారులు ప్రకటించారు. కానీ, కేవలం 55 మంది మాత్రమే ప్రస్తుతం వీటిలో ఉన్నారు.

ఎవరు చేయించుకోవాలి:

ఎవరికైనా జలుబు, దగ్గు, ఆయాసం, కళ్లు ఎర్రబడటంలాంటి లక్షణాలు కనిపిస్తే మీకు సమీపంలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల ద్వారా కూడా చేయించుకోవచ్చు.

ఈ సమయానికి ఇవ్వాలి

జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 11 సీహెచ్‌సీలు, 12 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కేంద్ర, ఘోష, పార్వతీపురం ఏరియా ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ఫలితం 24- 36 గంటలు, ట్రూనాట్‌ 24 గంటలు, ర్యాపిడ్‌ ఏంటిజన్‌ 30 నిమిషాల్లో వెల్లడించాలి.

94 కేంద్రాల్లో..

కరోనా కట్టడిలో ఇప్పుడు పరీక్షలే కీలకంగా మారాయి. దీనిలో భాగంగా జిల్లాలో 94 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో ఏర్పాట్లు చేశారు. పరీక్షల సంఖ్యను రోజుకు నాలుగు వేలకు పెంచారు. జిల్లా కేంద్రం, చుట్టుపక్కల మండలాల్లో ఆర్‌టీపీసీఆర్‌, పార్వతీపురం డివిజన్‌లో ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేవలం 30 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలిపే ర్యాపిడ్‌ ఏంటిజన్‌ కిట్లను అన్నీ పీహెచ్‌సీలకు పంపించారు. అన్ని శాంపిల్స్‌ జిల్లా కేంద్రంలో మిమ్స్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌కు తీసుకొచ్చి పరీక్ష నిర్వహిస్తున్నారు. ట్రూనాట్‌ పరీక్షలకు బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం, ఎస్‌.కోటలో ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: కొవిడ్ సెకండ్ వేవ్: సేవల్లో మరింత సమన్వయం

నేటి నుంచి ప్రారంభిస్తాం

రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు ఆపారు. జిల్లాలో ట్రూనాట్‌, ర్యాపిడ్‌ టెస్టులు చేశాం. కొన్ని చోట్ల గతంలో శాంపిల్స్‌ ఇచ్చిన వారికి రిపోర్టులు రాలేదని, పెండింగ్‌ పెరిగిపోతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి తిరిగి అన్ని చోట్ల ప్రారంభమవుతాయి. కరోనా బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా ఉండరాదు. అలాగే శాంపిల్స్‌ ఇచ్చాం కదా రిపోర్టు వచ్చాక జాగ్రత్త పడదాం అని అలసత్వం ప్రదర్శించరాదు. మిగిలిన వారికి ఇబ్బంది లేకుండా నడుచుకోవాలి. - ఎస్‌వీ రమణకుమారి, డీఎంహెచ్‌వో

మొదటి దశపరీక్షలు : 7,73,095

పాజిటివ్‌ కేసులు : 41,443

రెండో దశ పరీక్షలు : 77,352

పాజిటివ్‌ కేసులు : 9,183

ఇదీ చదవండి:

ఇంటి వద్ద ఉండే రోగులకు సూచనలేవి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.