ETV Bharat / state

విజయనగరం సబ్​ జైలులో కొవిడ్ పరీక్షలు

కొవిడ్ నియంత్రణలో భాగంగా... విజయనగరం సబ్​ జైలులో కరోనా పరీక్షలు నిర్వహించారు. 28 మంది అండర్ ట్రయిల్ ఖైదీలు, 10 మంది జైలు సిబ్బంది నుంచి స్వాబ్స్ తీసి, మిమ్స్ ఆసపత్రికి పరీక్షల కోసం పంపించారు.

విజయనగరం సబ్​ జైలులో కొవిడ్ పరీక్షలు
విజయనగరం సబ్​ జైలులో కొవిడ్ పరీక్షలు
author img

By

Published : May 22, 2021, 10:15 AM IST

జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశాల మేరకు విజయనగరం సబ్​ జైలులో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. జైలులో ఉన్న 28 మంది అండర్​ ట్రయిల్ ఖైదీలు, 10 మంది జైలు సిబ్బంది నుంచి స్వాబ్స్ తీసి, మిమ్స్ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు. జైలు సూపరింటెండెంట్ దుర్గారావు, డీఎస్​జెఓ మధుబాబు పర్యవేక్షణలో, డిప్యూటీ డీఎంహెచ్​ఓ డాక్టర్ బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో, ప్రత్యేక బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. జైలులో ప్రతిఒక్కరూ మాస్కులను ధరించాలని, కొవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలి ఈ సంధర్భంగా వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీగా తగినవారా అనే సందేహం కలుగుతోంది : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.