ETV Bharat / state

విజయనగరం జిల్లాలో భారీగా తగ్గిన కరోనా కేసులు - vizianagaram district corona news

అసలే కరోనా పరీక్షలు తక్కువ. చేసిన పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయో తెలియని దైన్యం. అప్పటికే పరిస్థితి విషమించి ఆసుపత్రికి వెళితే పడక దొరకని దుస్థితి. ఒకవేళ దొరికినా ప్రాణవాయువు అందుతుందో లేదోనన్న ఆందోళన. విజయనగరం జిల్లాలో నిన్న మొన్నటి వరకు ఇదీ పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టింది. ఆస్పత్రుల్లో పడకలతో పాటు సరిపడింత ఆక్సిజన్ అందుబాటులో ఉంది.

corona cases decreased in vizianagaram district
విజయనగరం జిల్లాలో భారీగా తగ్గిన కరోనా కేసులు
author img

By

Published : Jun 6, 2021, 4:51 PM IST

విజయనగరం జిల్లాలో భారీగా తగ్గిన కరోనా కేసులు

విజయనగరం జిల్లాలో కొవిడ్ తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొద్దిరోజులుగా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గతంలో పరీక్ష చేయించుకున్న ప్రతి 100 మందిలో 20మందికి పాజిటివ్ వచ్చేది. ఇప్పుడా సంఖ్య 5కు పడిపోయింది. గత నెలలో సరాసరిన క్రియాశీల కేసులు 8,700 ఉండగా.. ఇప్పుడు బాగా తగ్గాయి. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 650 ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలు ఉండగా ప్రస్తుతం 150 వరకు ఖాళీగా ఉన్నాయి. సాధారణ పడకలు 15 వందల వరకు ఉండగా 300 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. కర్ఫ్యూతో ప్రజలు బయటకు రాకపోవడం వల్ల కేసుల సంఖ్య బాగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. రైతుబజార్లు, దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చిందంటున్నారు.

కరోనా మూడో దశ హెచ్చరికలతో జిల్లా అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చిన్నపిల్లల కోసం జిల్లా ఆసుపత్రిలో 100, మాతాశిశు ఆసుపత్రిలో 50, నెల్లిమర్ల మిమ్స్‌లో 50పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇదీచదవండి.

దివ్యాంగుల ఆశ్రమంలోని కట్టడాల కూల్చివేతపై ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.