ETV Bharat / state

MINISTER VS MLA: మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం... నివ్వెరపోయిన అధికారులు! - vizainagaram latest updates

జగనన్న కాలనీలపై మంత్రులు బొత్స, పుష్ప శ్రీవాణి విజయనగరం కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మంత్రి బొత్సకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో సమీక్షలో పాల్గొన్న అధికారులు నివ్వెరపోయారు.

మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం...నివ్వెరపోయిన అధికారులు

author img

By

Published : Jul 6, 2021, 9:55 PM IST

మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం

పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంపై విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణకు, పార్వతీపురం శాసనసభ్యుడు అలజంగి జోగారావు మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే మధ్యనే వాగ్వాదం చోటు చేసుకోవటం పట్ల సమీక్షలో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులతో సహా అందరూ నివ్వెరపోయారు. సమీక్షలో భాగంగా మంత్రి జగనన్న కాలనీల ఏర్పాటులో మౌలిక సదుపాయలపై అధికారులతో చర్చిస్తూ... అంతర్గత రహదారుల అంశాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్భంగా పార్వతీపురం శాసనసభ్యుడు అలజంగి జోగారావు కలగచేసుకుని... పార్వతీపురంలో 1900 మంది లబ్ధిదారులకు కోసం మూడు లే అవుట్లు ఎంపిక చేశారు. ఇందులో ఒక లే అవుట్ పట్టణానికి సుదూరంగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపటం లేదని.. మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

అవకాశం ఉంటే లే అవుట్ మార్చాలని... మరొక ప్రాంతంలో ఇళ్లు కేటాయించేలా చూడాలని ఎమ్మెల్యే మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఆగ్రహానికి గురైన మంత్రి బొత్స... ఎమ్మెల్యే జోగారావుపై విరుచుకుపడ్డాడు. "లే అవుట్ గుర్తించి.. కొనుగోలు చేసిన తర్వాత ఎలా మారుస్తారు? ఓ ప్రజాప్రతినిధిగా నీకు తెలీదా?" అంటూ మండిపడ్డారు. అవసరం అయితే లబ్ధిదారులకు సంబంధిత లే అవుట్​లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందే తప్ప మార్చే అవకాశమే లేదని మంత్రి తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

ELECTRIC SCOOTERS: ప్రభుత్వ ఉద్యోగులకు.. రాయితీతో ఎలక్ట్రిక్ స్కూటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.