విజయనగరం జిల్లా పార్వతీపురం శివారులోని వైకేఎం కాలనీలోని వైటీసీ భవనంలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పలువురు అధికారులు భవనాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు పార్వతీపురం-బొబ్బిలి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు రెండు గంటలపాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు.
ఇవీ చూడండి...