గులాబ్ తుపాను విజయనగరం జిల్లా సాలూరులోని పలు కాలనీల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ కాలనీ వాసులు పూర్తిగా జలదిగ్భందంలో ఉన్నారు. నీరు బయటికి వెళ్లే మార్గం లేక నాలుగు రోజులుగా ఈ కాలనీలు నీళ్లలోనే మునిగి ఉన్నాయి. రాత్రి అయితే ఇళ్లలో పాములు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములు ఎక్కడ కాటేస్తాయోనని బిక్కుబిక్కుమంటు కాలనీవాసులు వణికిపోతున్నారు.
ఇదీ గులాభ్ తుపాను వల్ల జలదిగ్భందంలో చిక్కుకున్న సాలూరు పట్టణం రామా కాలనీ, టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాలనీల పరిస్థితి.
ఇప్పటికీ కూడా మోకాళ్ల వరకు లోతు నీరు ఉంది. వంట వార్పు లేదు. బయట నుండి ఆహారం తీసుకొని వచ్చి తినాల్సిన దుస్థితి. నీరు బయటికి పంపించే మార్గం చేపట్టాలని కోరిన అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు.
ఇదీ చదవండి: GULAB EFFECT: గులాబ్ తుపాన్ బీభత్సం.. జిల్లాలో ముగ్గురు మృతి