ETV Bharat / state

'గుర్తింపు ఇచ్చి 15 రోజులైనా.. కోవిడ్ చికిత్స ప్రారంభించరా?' - collector visits covid hospitals in chipurupally at vizianagaram

విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని కోవిడ్ ఆసుపత్రుల్లో.. జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆకస్మిఖ తనీఖీలు చేశారు. ఆసుపత్రులో రోగులకు అందుతున్న వైద్యం, సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రైవేటు ఆసుపత్రి అయిన.. విజయ నర్సింగ్ హోంను ప్రభుత్వం కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించి 15 రోజులు గడిచినా.. కరోనా సేవలు ప్రారంభించకపోవటంపై కలెక్టర్ ఆగ్రహించారు. తక్షణమే కోవిడ్ సేవలను ప్రారంభించాలని ఆదేశించారు.

collector visit covid hospitals
కొవిడ్ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్
author img

By

Published : May 3, 2021, 6:06 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని కోవిడ్ ఆసుపత్రులను.. జిల్లా పాలనాధికారి హరి జవహర్ లాల్ ఆకస్మిక తనీఖీలు చేశారు. చీపురుపల్లిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్​తో పాటు.. ప్రైవేటు నర్సింగ్ హోం విజయ ఆసుపత్రిని పరిశీలించారు. తొలుత ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనీఖీ చేశారు. కోవిడ్ వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలు, మందులు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యాధికారులు, ఆసుపత్రుల సిబ్బంది విజ్ఞప్తి మేరకు అదనపు వసతులను సమకూరుస్తామన్నారు.

ఆసుపత్రుల పరిసరాల్లో పరిశుభ్రతపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు... ప్రైవేటు ఆసుపత్రి.. అయిన విజయ ఆసుపత్రిని ప్రభుత్వం కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించింది. గుర్తింపు ఇచ్చి 15 రోజులు గడిచింది. అయినా... ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటికీ కోవిడ్ సేవలను ప్రారంభించకపోవటంపై.. కలెక్టర్ ఆగ్రహించారు. తగిన చర్యలు చేపట్టి వెంటనే సేవలు ప్రారంభించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

మా వాళ్లు ఎలా ఉన్నారో..? రోగుల బంధువుల్లో ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.