ఏటీఎంలో ఆకస్మాత్తుగా నాగుపాము కనిపించేసరికి డబ్బులు తీయడానికి వెళ్ళిన ఖాతాదారులు భయంతో పరుగులు తీశారు విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఆకుల డిపో సమీపంలోని కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో. గురువారం రాత్రి నాగుపాము సుమారు 20 నిమిషాల పాటు కదలకుండా అక్కడే తిష్ట వేసింది. డబ్బులు తీయడానికి వెళ్లిన ఖాతాదారుడికి నాగుపాము కనిపించడం వల్ల భయంతో బయటకు వచ్చారు. గమనించిన స్థానికులు పాములు బయటకు పంపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పాములు పట్టే వాడికి సమాచారం అందించారు. అతను అందుబాటు లేకపోవడం వల్ల ఏటీఎం తలుపులు తీసి వదలేశారు. కొద్ది సేపటికి పాము చల్లగా అక్కడి నుంచి జారుకుంది.


ఇదీ చదవండి :