ETV Bharat / state

జిల్లాలో ఉపాధి హామీ పనులు.. కేంద్ర బృందం పరిశీలన

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో జరగుతున్న ఉపాధి హామీ పనులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ బృంధం ప్రతినిధులు పరిశీలించారు. గ్రామ సభల తీర్మానం లేకుండానే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని తెలుగుదేశం నేతలు.. కేంద్ర ప్రతినిధుల బృందానికి ఫిర్యాదు చేశారు.

Central team
కేంద్ర బృందం
author img

By

Published : Sep 14, 2021, 10:08 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని నర్సీపురం, పేద బొండపల్లి పంచాయతీల్లో ఉపాధిహామీ పనులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి బృందం ప్రతినిధులు రోహిత్ కుమార్, అమరేంద్ర ప్రతాప్ సింగ్, హంసల్ కుమార్ పరిశీలించారు.

నర్సీపురం పంచాయతీలోని ఈదలబంద, పేద బొండపల్లిలోని తామర చెరువు, రహదారి ఇరువైపులా మొక్కల పెంపకాన్ని అధికారులు పరిశీలించారు. పేద బొండపల్లి, విశ్వంభరపురంలోని వేతనదారులతో మాట్లాడారు. ఈదలబంద వద్ద సూచిక లేకపోవడం, లోతు తక్కువ పనులపై అధికారులు మండిపడ్డారు. విశ్వంభరపురం గ్రామంలో ఓ రైతు సాగుచేస్తున్న జీడి పంట పొలంలోని సందర్శించి..రైతులను అడిగి పెంపకం పద్ధతులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పులువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర బృందానికి తెదేపా ఫిర్యాదు

గ్రామ సభల తీర్మానం లేకుండానే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని తెలుగుదేశం నేతలు... కేంద్ర ప్రతినిధుల బృందానికి ఫిర్యాదు చేశారు. సంవత్సరానికి సరిపడా ఉన్న పని దినాల్ని 5నెలల్లోనే పూరి చేసి బిల్లులు తయారు చేస్తున్నారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సక్రమంగా వాటిని చెల్లించట్లేదన్నారు. అన్నింటినీ పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని కేంద్ర కమిటీ సభ్యులు చెప్పినట్లు తెదేపా నేతలు వెల్లడించారు.

ఇదీ చదవండి

GVL: ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది: ఎంపీ జీవీఎల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.