బియ్యం బస్తాల కింద గంజాయి పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. భోగాపురం జాతీయ రహదారి వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 500 కిలోలకు పైగా ఉన్న గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ. 50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీన్ని విశాఖ జిల్లా గంగవరం పోర్ట్ నుంచి బిహార్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి జై వినోద్ కుమార్, సాహూ, వినోద్ రాయ్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వీరాంజనేయరెడ్డి తెలిపారు. దీని వెనుక ఉన్న మిగతా వ్యక్తుల గురించి విచారణ చేస్తున్నామని చెప్పారు.
ఇవీ చదవండి...