విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. లారీలో గంజాయి తీసుకెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం రావటంతో తనిఖీలు చేశారు. 138 పొట్లాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి 35 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: మూడు సింహం ప్రతిమల్లేవు.. విచారణ చేస్తున్నాం: మంత్రి వెల్లంపల్లి