లాక్డౌన్ అనంతరం విజయనగరం జిల్లా సాలూరు ఆర్టీసీ డిపో నుంచి బస్ సర్వీసులు ప్రారంభించారు. 17 బస్ సర్వీసులుకు గాను సాలూరు నుంచి విశాఖకు 6, బొబ్బిలి నుంచి పార్వతీపురానికి, సాలూరు నుంచి శ్రీకాకుళం, బొబ్బిలి నుంచి విశాఖ, శ్రీకాకుళం నుంచి పార్వతీపురానికి రెండేసి బస్సులు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ప్రయాణికులకు కరోనా వ్యాపించకుండా భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. బస్సులో కూర్చునే సీటు విధానాన్ని పూర్తిగా మార్పు చేశారు. బస్సుల్లో ప్రయాణించేవారికి శానిటైజర్స్, మాస్కులు ఇచ్చి ఆర్టీసీ సిబ్బంది పలు సూచనలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: